ధనుష్ దేవర పొలి, భానుచందర్, శ్వేత, సత్యప్రియ తదితరులు ప్రధాన పాత్రధారులుగా సహస్ర శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.వి.దిలీప్ కుమార్ దర్శకత్వంలో నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు నిర్మిస్తున్న చిత్రం ‘నడికట్టు’ ట్రైలర్ విడుదల యింది. నటుడు రాజారవీంద్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఓ మంచి సినిమాను అందిస్తున్న యూనిట్ కు శుభాకాంక్షలు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రంలో పాల్గొన్న టీఎఫ్ సీసీ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘నడికట్టు’ ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు మాట్లాడుతూ.. వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మంచూరి సోమశేఖర్ రావు. సినీరంగంపై ఉన్న ఆసక్తి, అభిమానం నన్ను ‘సహస్ర శ్రీ క్రియేషన్స్’ అనే బ్యానర్‌ను స్థాపించడానికి ప్రేరేపించాయి. మంచి కథలు, మంచి భావాలు కలిగిన సినిమాలు ప్రేక్షకులకు అందించాలి అన్న కోరికతో నా ఈ సినీ ప్రయాణం మొదలైంది. సహస్ర శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వస్తున్న మా తొలి చిత్రం ‘నడికట్టు’ మేము ఎంతో ప్రేమతో, శ్రద్ధతో రూపొందించిన ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఇది. ‘నడికట్టు’ ప్రాజెక్టు మా అందరి కల. ఆ కలకు ఇప్పుడు మేమంతా కలిసి జీవం పోశాం. టీమ్ అంతా ఎంతో కష్టపడి సినిమా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచి, సహాయ, సహకారాలు, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మా పక్కన నిల్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్బంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొత్త నటీనటులు, వివిధ కళాకారులతో ప్రారంభమైన ఈ ‘నడికట్టు’లో ఎంతో అనుభవం గల భానుచందర్ సర్, ప్రభాకర్ సర్, చిత్రం శ్రీను… ఇలా ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టుల చేరికతో సినిమా మరింత బలంగా, అద్భుతంగా మీ ముందుకు రాబోతోంది. భానుచందర్ సర్ మీరు ఈరోజు ఇక్కడ మా మధ్య ఉండటమే మా‌కు గర్వకారణం. షూట్ టైములో మీ డెడికేషన్, పాషన్ తో పాటు మీ టాలెంట్ మా యూనిట్ ని నిజంగా ఎంతో ఇన్స్పైర్ చేశాయి. మా ప్రాజెక్ట్ లో మీరు భాగమవడం మా‌కు ఒక ప్రివిలేజ్ మాత్రమే కాదు..ఒక బలం కూడా. మీరు ఇచ్చిన సలహాలవల్ల సినిమా అవుట్ ఫుట్ ఇంకో స్థాయికి వెళ్లిందని వినమ్రంగా చెబుతున్నాను. థాంక్యూ వెరీ మచ్ సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
హీరో ధనుష్ దేవర పొలి మాట్లాడుతూ..సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చి తీరుతుందని అందరు ఆశీర్వదించాలని కోరారు.
తారాగణం : హీరో ధనుష్ దేవర పొలి, భానుచందర్ (సీనియర్ నటుడు), శ్వేత, సత్యప్రియ, వరదారెడ్డి, బాహుబలి ప్రభాకర్, గడ్డం నవీన్, చిత్రం శ్రీను,చిట్టిబాబు, పొట్టి మామ, భాను పి.ఆర్, సత్యప్రసాద్, జయ్ చంద్ర, విజయ్ గౌడ్, త్రినాధ్, శివ, శ్రీ బాలాజీ, వినోద్ కుమార్, రామేశ్వరం, పద్మజ, చంద్ర శేఖర్,కృష్ణ చైతన్య, జగన్, రాజేశ్వరి, దేవిక రవి (డాన్సర్), అవంతిక (ఐటెం సాంగ్ డాన్సర్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కళ్యాణ్ సామి-ఉత్తమ్ రామ్, అసిస్టెంట్ సినిమాటోగ్రఫీ : అశోక్ జవాజి, సంగీతం :ఎస్.ఎస్. వెంకటేష్, బ్యానర్ :సహస్ర శ్రీ క్రియేషన్స్, నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు, దర్శకత్వం: ఎస్.వి.దిలీప్ కుమార్.