టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకడు శర్వానంద్‌ (Sharwanand). గతేడాది ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్‌. ఈ టాలెంటెడ్‌ హీరో గతేడాది టైమ్‌ లైన్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్టందుకున్నాడు. ఒకే ఒక జీవితం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ టాక్‌ తెచ్చుకుంది. లేటెస్ట్‌ టాక్ ప్రకారం శర్వానంద్‌ ఖాతాలో మూడు తెలుగు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి శ్రీరామ్ ఆదిత్య ( Sriram Aditya) డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా.

ఈ మూవీకి మనమే (Maname) టైటిల్‌ ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్‌ టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాపులర్ బ్యానర్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ లండన్‌లో కొనసాగుతున్నట్టు కొన్ని రోజుల క్రితం ఓ అప్‌డేట్‌ కూడా వచ్చింది. తాజాగా మరో న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కథానుగుణంగా లండన్‌, హైదరాబాద్‌లో సినిమాను షూట్‌ చేశారని సమాచారం. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఉప్పెన సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాపులు కృతిశెట్టి తలుపుతట్టాయి. శర్వానంద్‌ సినిమాతో కృతిశెట్టి మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌పై వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు. Sharwa35గా వస్తున్న ఈ మూవీపై మరిన్ని వివరాలు త్వరలో క్లారిటీ రానున్నాయి.