నిర్మాతలు చిలుకోటి రఘురామ్ చలపల్లి విఠల్ గౌడ్‌లు, చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్.ఆర్. మువీ
క్రియేషన్స్ బ్యాసర్‌పై ఎల్.వి. ప్రసాద్ ల్యాబ్ థియేటర్‌లో హర్రర్, కామెడీ, యాక్షన్, లవ్‌సెంటిమెంట్ చిత్రం యజ్ఞ. ఈ
చిత్రం ట్రెలర్ మరియు ౩ పాటలు వున్నాయి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్
మరియు జహీరాబాద్ యం.పి. బిజి. పాటిల్, నారాయణ గౌడ్, ఎమ్మెల్యే, మహారెడ్డి, భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి
కిరణ్, ఆంధోల్, ఎమ్మెల్యే, సాయివెంకట్, యార్హగడగడ్డ రజనీ, సరస్వతీ పాసకులు ఛైవజ్ఞ శర్మ మొదలగు పెద్దల
సమక్షంలో కార్యక్రమం జరిగింది.
తెలంగాణ పిలిం చాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… ‘ చిత్తజల్లు ప్రసాద్‌గారు నాకు
బాగా కావాల్సిన వారు. ఒక కుర్రాడిలా ఎప్పుడూ అప్‌డేట్ అవుతుంటాడు. సంగీత దర్శకులు లక్ష్మణసాయిగారు
చాలా అద్భుతమైన సంగీతం ఇస్తాడు. ఈ చిత్రం చాలా బాగా వచ్చుంటది. ఆర్టిస్టులు, నటీనటులు అందరూ
కొత్తవారేం కాదు. అందరూ తలపండిన వారు. చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించి వుంటారు. ఈ చిత్రానికి
నా సహాయం ఎప్పుడూ వుంటుంది. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికైనా నేను సిద్ధంగా వున్నాను. కొత్త చిత్రాలు
ఆదరించాలి. అప్పుడే వారు మరిన్ని మంచి సినిమాలు చేయడానికి అవకాశం వుంది” అని అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…యజ్ఞ ట్రెలర్, పాటల కార్యక్రమానికి విచ్చేసిన సినీ, రాజకీయ
ప్రముఖఅందరికీ కృతజ్ఞతలు. దర్శకులు ప్రసాద్‌గారు చాలా కష్టపడే వ్యక్తి. అవుట్‌పుట్ బాగా రావాలని చాలా
కష్టపడతారు. సంగీత దర్శకులు లక్షణసాయిగారి సంగీతం మీకు థియేటర్‌లో అదరగొడుతుంది. హీరో శివకి
మంచి ప్యూచర్ వుంది. ఇందులో నటించిన అమ్మాయిలందరూ చాలా బాగా చేశారు. చాలా చిత్రాల కోసం మేము
ఎంతో సపోర్ట్ చేశాము. పి.ఆర్.ఒ. బాబు నాయక్ లాంటి వారు కూడా చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నగారు లాంటి వారు కూడా చిన్న చిత్రాలను చాలా ఎంకరేజ్ చేస్తారు. ఈ
కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేదు. ప్రేక్షకుడికి మెచ్చితే అదే పెద్ద సినిమా కష్టపడి అందరూ చిత్రాలు
తీయండి. ఈ చిత్రం మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకులు చిత్తజల్లు ప్రసాద్ మాట్లాడుతూ… యజ్ఞ సినిమాలో ఫైట్స్, పాటలు, స్టోరీ చాలా అద్భుతంగా
వుంటాయి. ప్రేక్షకులకు ఏం కావాలో అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. సినిమాను నేచురల్‌గా తీయడం జరిగింది.
నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. మా నిర్మాతలు మాకు అన్నీ సమకూర్చారు. మాకు సహకరించిన
పెద్దలందరికీ ధన్యవాదాలు. మా చిత్రాన్ని అందరూ ఆదరించాలి” అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ‘మా దర్శకులు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నటీనటులందరికీ
మంచి పేరు తీసుకువస్తుంది. మా కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు మా చిత్రాన్ని
చూసి సపోర్ట్ చేయాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి దోహదం అవుతుంది” అని అన్నారు.
యజ్ఞ చిత్రంలో సుమన్‌శెట్టి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, హీరో శివ, ప్రదాప్ రెడ్డి, హీరోయిన్
గోవా జ్యోతి, ఐటమ్‌సాంగ్ సునీత (జ్యూసీ), స్వర్ణలత, పూజతశ్రీ, కాళదాసు, దుర్గ, అన్నపూర్ణ యాదవ్, విలన్‌గా
చెన్నకేశవ, లాయర్ సుబ్బారెడ్డి, విఠల్ గౌడ్, సుభాన, అహమ్మద్, మహమ్మద్, జానీ, మీరావతి, అశోక్ నాయుడు,
తిరుపతి, సి.హెచ్. నాగరాజు, రామకృష్ణ, దీపిక జూ. కళ్ళ చిదంబరం, రాము తదితరులు నటించారు
సాంకేతిక నిపుణులు : సమర్పణ : దేశ్‌పాండే, సుభాష& రావ్ (దొర) ముళ్ళవరం, డిఒపి: జ.క్రిష్ణ నాయుడు,
కొరియోగ్రఫీ : బండ్ల రామారావు, తాజ్‌ఖాన్, కో-డైరెక్టర్ : మురళీకృష్ణ దేవకి (మార్కాపురం అసోసియేట్స్),
ఫణవీంద్ర ప్రసాద్, శ్రీకర్, ఫైట్స్: హుస్సేన్ భాయ్, మేకప్ : రఘు, పిఒపి : విజన్ స్టూడియో ఎ. రమేష్, పాటలు : గడ్డ
సీతారామచౌదరి, కవిశ్రీ ప్రసాద్, డిజైనర్ : ఈశ్వర్, పిఆర్‌ఒ : బాబు నాయక్, కథ మాటలు, సంగీతం : లక్ష్మణసాయి,
నిర్మాతలు : చిలుకోటి రఘురామ్, చీలపల్లి విఠల్ గౌడ్ (ఆకుల లింగాపూర్), స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : చిత్తజల్లు ప్రసాద్.