రాజీవ్ కనకాల, శకలక శంకర్, శ్రీతేజ్, ఆక్సాఖాన్, రూపిక ప్రధాన తారాగణంగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మించిన చిత్రం దళారి. ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, రాజకీయ నాయకులు, దళారిలు, బినామీల మధ్యలో జరుగుతున్న కొత్త అంశాలను జోడిస్తూ, సెన్సార్ పూర్తి చేసుకొని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఇందులో భాగంగా పొలిమేర-2 ఫేమ్ సత్యం రాజేష్ గారు రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు, హీరో సునీల్ గారు ఈ రోజు ఉదయం 11.43 గం॥లకు ‘అన్నదమ్ములను’ లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పొలిమేర-2 ఫేమ్ సత్యం రాజేష్ గారు మాట్లాడుతూ.. మా శంకర్ హీరోగా చేసిన సాంగ్ చాలా బాగుంది. ఒకరకమైన ఫీల్‌తో, పల్లెటూరి బ్యాగ్రౌండ్‌తో మంచి మ్యూజిక్ అందించారు అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. మా డైరెక్టర్ గోపాల్ రెడ్డి పెద్ద డైరెక్టర్ అవుతాడు, ప్రొడ్యూసర్‌కి మంచి డబ్బులోస్తాయి ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు మాట్లాడుతూ.. తమ్మడు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో హరిగౌర మ్యూజిక్ అందించి మా తమ్ముడు శంకర్, రాజీవ్‌కనకాల నటించి, వెంకట్ రెడ్డి నిర్మించిన ఒక హాట్ టచింగ్ సాంగ్‌ను సుద్దాల అశోక్ తేజ గారు రాశారు, ఈ సాంగ్ చాలా డెప్త్ ఉంది కథ ఏంటో తలియకుండానే ఒక ఎమోషన్‌లోకి తీసుకెళ్ళింది, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా అన్నట్టు, ఒక్కవిజువల్ చాలు, ఈ సాంగ్ చాలు, ఈ సినిమాను ఎంత ప్రేమించి, ఎంత డెప్తుల్లో చెప్పారు ఈ కథని అని, నేను చాలా ఇంప్రెస్ అయ్యానన్నారు, ఇది చూస్తుంటే ఒక ‘బలగం” లాంటి సినిమాగా ఎప్పటికీ గుర్తుండి పోయే మెలోడిగా మంచి అన్నదమ్ముల ఎమోషన్‌గా సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికీ నెలలు సంవత్సరాలు గుర్తుండి పోతుందని ఈ సినిమా కూడ ఈ సాంగ్ లాగా పెద్ద హిట్ అవుతందని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.హీరో సునీల్ గారు మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ సాంగ్ మనందరి కళ్ళకు నీళ్ళు తెప్పిస్తుంది, చాలా మంచి హార్ట్ టచింగ్ సాంగ్ మీరు కూడ చూసి ఎంజాయ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాలలో అందరి కళ్ళముందు జరిగే అంశాల ఆధారంగా ప్రతి సన్నివేశం తీసుకోవడం జరిగింది. పాటలో ఉన్న ఎమోషన్ ని మా చిత్ర యూనిట్ సభ్యులు ప్రతిరోజు ఫీలై తీసిన చిత్రం దళారి, ఇదొక కొత్త ట్రెండ్ చేస్తుంది. సీనియర్ ప్యాడింగ్ ఆర్టిస్తులు. టెక్నీషియన్స్ తో రూపొందిన చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ఈ పాటను లాంచ్ చేసిన కోన వెంకట్ గారికి, సత్యం రాజేష్ గారికి, సునీల్ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అతి త్వరలో థియోటర్లలో రిలీజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని వేడుకొన్నారు. నటీనటులు : రాజీవ్ కనకాల, శకలక శంకర్, శ్రీతేజ్, ఆక్సాఖాన్, రూపిక, గిరిధర్, జెమిని సురేష్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్, రఛ్చరవి, RX 100 లక్ష్మణ్, కృష్ణేశ్వర రావు, సురేష్ కొండేటి. మ్యూజిక్ డైరెక్టర్ : హరిగౌర, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ మరియు సురేష్ గంగుల, సింగర్స్ : సాయి చరణ్ భాస్కరుని మరియు హరిగౌర, డి.ఒ.పి : మెంటం సతీష్ , ఎడిటర్ : నందమూరి హరి, కొరియోగ్రఫి రాజ్ పైడ , ఆర్ట్ : రాజ్ అడ్డాల , స్టంట్స్ : పృధ్వి, ప్రొడక్షన్ : ఆలూరి రాము మరియు రాజ వంశి, నిర్మాత : వెంకట్ రెడ్డి, రచన, దర్శకత్వం : కాచిడి గోపాల్‌రెడ్డి.
దళారి
Related Posts
Tovino Thomas’ “IDENTITY” is Mollywood’s FIRST HIT OF THE YEAR 2025
After the sensational 2024, Malayalam cinema kickstarts 2025 in a blasting way with the mind-blowing thriller Identity. In 2024, the blockbuster films like Manjummel Boys, ARM, Aavesham, Kishkinda Kandam,…
బ్రహ్మాండ చిత్రాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన “అఖండ” ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి
బ్రహ్మాండ చిత్రాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన “అఖండ” ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డ మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలో శ్రీమతి మమత సమర్పించు చిత్రం ‘బ్రహ్మాండ’ చిత్ర సహనిర్మాత శ్రీమతి దాసరి మమత . మిర్యాల…