కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాను ప్రేక్షకులు ఇష్ట‌ప‌డుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వ‌చ్చిన సినిమా ‘ఎస్‌ 99’. సి.జగన్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వంలో టెంపుల్ మీడియా -ఫైర్ బాల్ బ్యానర్స్‌పై యతీష్, నందిని సంయుక్తంగా నిర్మించిన ‘ఎస్‌ 99’ మూవీ నేడు (శుక్ర‌వారం) థియేట‌ర్‌ల‌లో విడుద‌లైంది. రివ్యూ లో చూద్దాం !

సినిమా కథ: సి.జగన్ మోహన్ (S99 ) రిటైర్డ్ ఎన్ఎస్ఏ అధికారి. తాలుక్ దార్ పాషా ఓ క్రిమినల్. మినిష్టర్ కి సంబంధించిన విలువైన సమాచారం ఓ మహిళ జర్నలిస్ట్ వద్ద ఉందని తెలుసుకున్న మంత్రి తాలుక్ దార్ పాషాతో కిరాయి ఒప్పందం చేసుకుంటాడు. ఆ మహిళ జర్నలిస్ట్ ను కిడ్నాప్ చెయ్యాలని అనుకుంటారు పాషా. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్ఏ రిటైర్డ్ అధికారి సి.జగన్ మోహన్ (S99 ) సహాయం కోరుతారు. లేడి జర్నలిస్ట్ ను కాపాడే లోపు.. ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు తాలుక్ దార్ పాషా. ఆమెను కాపాడే ప్రయత్నంలో కొంతమందిని చంపేస్తాడు S99. ఎవరు చంపారనే తెలుసుకునే క్రమంలో గతంలో చనిపోయిన S99 మళ్ళీ ఎలా బ‌తికొచ్చాడు ఆశ్చర్యపోతూనే.. గతంలోనూ, ప్రస్తుతమూ తన దారికి అడ్డువస్తున్న S99 ని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు పాషా.. అసలు వీరి మధ్య ఉన్న పాత పగ ఏంటీ? ఆ అమ్మాయిని S99 కాపాడాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా లో నటీనటుల పనితీరు:
ప్రధాన పాత్రలో నటించిన సి జగన్మోహన్ చాలా న్యాచురల్ నటించాడు. స్టైలిష్ లుక్ బాగా కుదిరింది. దర్శకుడుగా, నటుడిగా తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ బాగా చేసాడు. తాను రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే, మాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఇక దయానంద్ రెడ్డి ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించిన బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ అల్లరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. కిరికిరి రాజారెడ్డి పాత్రలో నటించిన దేవిప్రసాద్‌ కామెడీ సినిమాకు మరో హైలెట్. మిగతా పాత్రల్లో నటించిన చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, చక్రపాణి, కదిరి యోగి, రూపా లక్ష్మి, అల్లు రమేష్ త‌మ త‌మ‌ పాత్రల‌ పరిధి నటించారు.

ప్లస్ పాయింట్స్

డైరెక్షన్

మ్యూజిక్

నటీనటుల తీరు

మైనస్ పాయింట్స్

అక్కడ అక్కడ నెమ్మిదిగా సాగె సన్నివేశాలు

సినిమాలో సాంకేతిక వర్గం పనితీరు:
ఒక వైపు ప్రధాన పాత్రలో నటిస్తూ, మరో వైపు దర్శకత్వం వహించిన సి.జగన్ మోహన్ S99 సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌లో కూర్చోబెట్టారు. తాను రాసుకున్న క‌థ‌ను అంతే ప‌ర్‌ఫెక్టుగా తెర‌పై చూపించి త‌న టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. జగన్ మోహన్ ప‌నితీరుకు వంద‌కు వంద మార్కులు వేయ‌వ‌చ్చు. ఇక‌ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇదొక విజువల్‌ అండ్‌ సౌండ్‌ బేస్డ్‌ కాన్సెప్ట్‌ మూవీ. డిఫరెంట్‌ కలర్‌ టింట్‌తో తెరకెక్కించారు. జగన్మోహన్‌తో వింగ్ చున్ అంజి చేయించిన ఫైట్స్ చాలా స్టయిలిష్‌గా ఉన్నాయి. విజయ్ కూరాకుల అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మ‌రింతా హెల్ప‌య్యాయి. సి. యతీష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతలు యతీష్, నందిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా క్వాలిటీగా నిర్మించిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

సినిమా విశ్లేషణ:
ఆడియ‌న్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు జగన్మోహన్ చేసిన ప్ర‌య‌త్నాన్ని, ప్ర‌యోగాన్ని అభినందించ‌వచ్చు. టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘ఎస్‌ 99’ చిత్రం చాలా వినూత్న కథ, స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కొత్త క‌న్సెఫ్టు, క్రైమ్ థ్రిల్లర్‌లు ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

సినిమిర్చి .కామ్ రేటింగ్ : 3/5