
Suchirindia Dr. Lion Kiron Hosted iftar Party at Radisson Blu Hotel, Banjarahills
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు సూచిరిండియా అధినేత లయన్ కిరణ్
*హైదరాబాద్:* పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో డాక్టర్ లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ప్రముఖులు సినీనటుడు సయ్యద్ సోహెల్ ముస్లిము పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ కిరణ్ మాట్లాడుతూ… ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవా ~ దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. అనాథ ముస్లిం బాలలకు ఇఫ్తార్ విందు తో పాటు బట్టలు ఇచ్చారు.. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న వారు రంజాన్ పండుగ ప్రజల జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు తెలిపారు.