బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ కాన్సెప్ట్‌తో వస్తుందనే ఓకే చెప్పిందా?

సాయిపల్లవి సినిమా అంటేనే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అని భావిస్తారు అభిమానులు. ఆమె ఎంచుకునే కథాంశాల్లో తప్పకుండా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. రొటీన్‌ సబ్జెక్ట్స్‌ను నిర్మొహమాటంగా తిరస్కరిస్తుందీ భామ. ఆ కారణంగానే గత ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నది సాయిపల్లవి. ప్రస్తుతం ఆమె తమిళంలో శివకార్తికేయన్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది.తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి హిందీ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. బాలీవుడ్‌ అగ్ర హీరో అమీర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటించబోతున్నదని సమాచారం. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహించబోతున్నారని తెలిసింది. నటనతో పాటు నృత్యానికి ప్రాధాన్యం ఉన్న కథాంశం కావడంతో దర్శకుడు సాయిపల్లవి వైపు మొగ్గుచూపారని బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *