• ప్రారంభించిన మంచు మ‌నోజ్, మౌనిక‌
  • డ్యూటీ మ‌ధ్య‌లోనూ వ‌చ్చి జిమ్ చేసుకునే వెసులుబాటు
  • స్టీమ్ బాత్, ఏరోబిక్స్, జుంబా స‌హా అనేక స‌దుపాయాలు
  • బీ ఫిట్ నిర్వాహ‌కుడు రాజ‌శేఖ‌ర్ పాపోలు

హైద‌రాబాద్, న‌వంబ‌ర్ 9, 2023: నిరంత‌రం తీవ్ర‌మైన ఒత్తిడి మ‌ధ్య ఉద్యోగాలు చేసే ఐటీ ఉద్యోగులు మ‌ధ్య‌లో ఒక్క‌సారి లేచి కాస్త రిలాక్స్ అయితే వాళ్ల ఉత్పాద‌క‌త మ‌రింత పెరుగుతుంద‌ని, అలా రిలాక్స్ అయ్యేందుకు వారికి అత్యంత స‌మీపంలోనే అత్యాధునిక‌ జిమ్ ఏర్పాటుచేశామ‌ని బృహ‌స్ప‌తి టెక్నాల‌జీస్ ఎండీ రాజ‌శేఖ‌ర్ పాపోలు తెలిపారు. న‌గ‌రంలోని ఐకియా ఎదురుగా అర‌బిందో ట‌వ‌ర్స్‌లో ఏర్పాటుచేసిన అత్యంత ఆధునిక‌మైన బీఫిట్ జిమ్‌ను ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్, మౌనిక దంప‌తులు గురువారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, “ఈ ఒక్క ట‌వ‌ర్స్‌లోనే దాదాపు 20 వేల మంది ఐటీ ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. వారితో పాటు చుట్టుప‌క్క‌ల ఉన్న అనేక కంపెనీల‌లోనూ చాలామంది ప‌నిచేస్తుంటారు. వీరంద‌రికీ అందుబాటులో ఉండేలా 5వేల చ‌ద‌ర‌పు అడుగుల సువిశాల స్థ‌లంలో అత్యాధునిక ప‌రిక‌రాల‌తో మా జిమ్ ఏర్పాటుచేశాం. గ‌తంలో మొద‌టిది ఎస్ఆర్ న‌గ‌ర్‌లో ఏర్పాటుచేయ‌గా, ఇది రెండోది. ఇందులో ఎలైట్ సిరీస్‌కు చెందిన అత్యాధునిక ప‌రిక‌రాల‌న్నీ ఉంటాయి. సెంట్ర‌లైజ్డ్ ఏసీ, మ్యూజిక్ సిస్టం రోజంతా ఉంటాయి. ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఏ స‌మ‌యంలోనైనా రావ‌చ్చు. రెండు షిఫ్టుల‌లో ఆరుగురి చొప్పున ట్రైన‌ర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒక న్యూట్రిష‌నిస్టు కూడా ఇక్క‌డే ఉండి, అవ‌స‌ర‌మైన ఆహార సూచ‌న‌లు ఇస్తారు. ఐటీ ఉద్యోగుల‌కు ఎక్కువ‌గా ఒత్తిడి ఉంటుంది, ఒకేచోట కూర్చుని ఎక్కువ‌సేపు ప‌నిచేయాల్సి ఉంటుంది. అలాంటివాళ్లు మధ్య‌లో వ‌చ్చి ఒక గంట సేపు జిమ్ చేసుకున్నా బాగుంటుంది. ఇక్క‌డ ఏరోబిక్స్, జుంబా కూడా ఉంటాయి. స్టీమ్ బాత్ స‌దుపాయం కూడా ఉండ‌టంతో.. జిమ్ చేసుకున్న త‌ర్వాత స్టీమ్ బాత్ తీసుకుని, దుస్తులు మార్చుకుని చాలా రిలాక్స్ అయ్యి మ‌ళ్లీ ఆఫీసుకు, లేదా ఇంటికి వెళ్లొచ్చు. కొన్ని ఐటీ కార్యాల‌యాల్లో కూడా జిమ్‌లు ఏర్పాటుచేస్తున్నా, అక్క‌డి కంటే ఇక్క‌డ ప్రొఫెష‌న‌ల్ ట్రైన‌ర్ల శిక్ష‌ణ‌లో.. అత్యాధునిక ప‌రిక‌రాల‌తో జిమ్ చేయ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు ఉంటాయి. దానికితోడు ఒత్తిడికూడా త‌గ్గుతుంది. దీన్ని ఐటీ ఉద్యోగులంతా స‌ద్వినియోగం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాం” అని చెప్పారు.