రూల్స్ రంజన్ తెలుగు మూవీ రివ్యూ చిత్రం: రూల్స్ రంజన్

నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్ వెన్నెల కిశోర్, ఆది, సుదర్శన్, అజయ్, సుబ్బరాజు, మక్రంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ తదితరులు

నిర్మాణ సంస్థ: స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్

రచన, దర్శకుడు: రత్న కృష్ణ

నిర్మాత: దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి

సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్

సినిమాటోగ్రాఫర్: దులీప్ కుమార్ ఎం.ఎస్

విడుదల తేదీ: 06-10-2023

యూత్ ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం, హాట్ బ్యూటీ హీరోయిన్ నేహా శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం రూల్స్ రంజన్. సమ్మోహనుడా అనే పాటతో సినిమాపై కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. అలాగే పబ్లిసిటీ కూడా పీక్స్ లో చేశారు. దాంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ శుక్రవారం థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..

కథ: 

మనోరంజన్(కిరణ్ అబ్బవరం) అనే వ్యక్తి ముంబైలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన పెట్టుకున్న రూల్స్ కి ఆ కంపెనీలో అందరూ అతని రూల్స్ రంజన్ అని ఆటపట్టిస్తుంటారు.ఈ క్రమంలో హీరోయిన్ సనా(నేహా శెట్టి ) అదే కంపెనీలో పనిచేస్తూ ఆయనకి మంచి ఫ్రెండ్ గా మారుతుంది. అది కాస్త ప్రేమగా మారే సమయంలో ఇద్దరికి మనస్పర్థలు వచ్చి దూరం అవుతారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలు ఏంటి, అలాగే వాళ్ళిద్దరూ చివరికి కలుస్తారా లేదా విడిపోతారా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే.

విశ్లేషణ:

ముంబై సాఫ్ట్ వేర్ కంపేనీలో కథ ప్రారంభం అవుతుంది. మొదటి సీన్ నుంచి ఆద్యాంతం చాలా కూల్ వాతావరణంలో రోమాంటిక్‌గా సాగుతుంది కథ. సినిమాలో ఫస్ట్ మొత్తం చాలా కొత్తగా అనిపిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. మనోరంజన్ పాత్రను ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా అతను చేసే సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. తరువాత హీరో హీరోయిన్ల నడుమ లవ్ ట్రాక్ మొదలౌతుంది. హీరోయిన్ చాలా అందంగా కనిపిస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ, లవ్ ట్రాక్‌తో ఆద్యాంతం ఆహ్లాదకరంగా సాగుతుంది. కథలో రూల్స్ రంజన్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసే సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకుడికి ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది. తరువాత వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అడల్ట్ హాస్యాన్ని అందించినప్పటికీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు. తరువాత సెకండ్ ఆఫ్ మొత్తం వీలేజ్ బ్యాగ్రౌండ్ లో కథ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకుడికి తరువాత ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం మొదలు అవుతుంది. సెకండ్ ఆఫ్ సినిమా ముంబై నుంచి విలేజ్‌కు మారుతుంది. ఇక్కడ హాస్యనటులు హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లను పరిచయం చేస్తారు. అయితే సెకండ్ ఆఫ్‌లో వచ్చే కామెడీ ఫస్ట్ ఆఫ్ ను మించి ఉంటుంది. ముఖ్యంగా కామెడీ రైటింగ్‌ సూపర్బ్. అలగే హీరోయిన్, హీరో ల నడుమ వచ్చే సీన్లు కొంచెం ఫన్నీగా ఉన్నా.. చాలా ఎమోషనల్ గా సాగుతాయి. ఇక క్లైమాక్స్‌లో వధువు గురించి వచ్చే డైలాగ్‌లు మనుసును దోచేస్తాయి. వివాహ వేదిక వద్ద సాగే మెలోడ్రామా ప్రేక్షకుల హృదయాన్ని అత్తుకునేలా ఉంటుంది. 

ఎవరెలా చేశారు:

మనోరంజన్‌గా కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించాడు. ఒక నిజాయితీ, అమాయకత్వంతో కూడిన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సరదాగా సాగే పాత్రలో బలమైన భావోద్వేగాలను పలికించాడు. ఇక మనోరంజన్ పాత్రను ప్రేక్షకులకు ఎక్కించడంలో కిరణ్ చేసే సీన్స్ ఆకట్టుకున్నాయి. హాట్ బ్యూటీ నేహా శెట్టి సనాగా మెప్పించింది. సినిమాలో తనకు చాలా ఇంపార్టెంట్ పాత్ర కాబట్టి మూవీ ఆద్యాంతం తన అందంతో ఆకట్టుకుంది. అలాగే మిగితా నటీనటులు అద్బుతమైన ప్రదర్శనను అందించారు. వెన్నెల కిషోర్ అడల్ట్ కామెడీ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చిన ముగ్గురు హాస్యనటులు – హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లు స్వతహాగా వారు కమెడియన్స్ కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద ప్లస్. అలాగే మిగా నటులు కూడా చాలా బాగా చేశారు.

సాంకేతిక అంశాలు: 

దర్శకుడు రత్నం కృష్ణ తన రచనతో డైరెక్షన్ తో మెప్పించాడు. ప్రతీ సీన్లో తన ప్రతిభ కనిపిస్తుంది. ప్రేక్షకుడిని మొదటి సీన్ నుంచే కట్టిపడేసేలా కథను సిద్దం చేసుకున్నాడు రత్నం కృష్ణ. కచ్చితంగా డైరెక్టర్ కు తెలుగు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకు రచయితగా తానే పని చేసి రైటింగ్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేశాడు. కేవలం కామెడీనే కాకుండా ఎమోషనల్ గా కూడా అద్భుతమైన రైటింగ్ ను అందించారు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ అంతా ముంబైలో కామెడీ, లవ్ ట్రాక్ ను రాసుకొని కథను చాలా ఆసక్తిగా నడిపించారు. అలాగే సెకండ్ ఆఫ్ విలేజ్ లో సాగే ఎమోషన్స్ ను చాలా బాగా చూపించారు. అమ్రిష్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచిన సమ్మోహనుడా అనే చార్ట్ బస్టర్ పాటను అందించారు. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో అలరించారు. అలాగే సినిమాటో గ్రాఫర్ దులీప్ కుమార్ ఎం.ఎస్ తన పని తనాన్ని చూపించారు. నగరంలో, పల్లేలో రెండు వేరియేషన్లలో చూపించే విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. హీరో కిరణ్ అబ్బవరం మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా చిత్రీకరించారు.  

ప్లస్ పాయింట్లు

కథ, కథనం

రచన, డైలాగ్స్

దర్శకత్వం

మ్యాజిక్

నిర్మాణ విలువలు

సమ్మోమనుడా సాంగ్

రేటింగ్: 3/5