రివ్యూ : #కృ ష్ణారామా.. వృ ద్ధులు ‘ఫేస్బుక్’ బాట పడితే?

చిత్రం : #కృ ష్ణారామా;
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాం త్ అయ్యం గార్, రచ్చ రవి, జెమిని
సురేశ్, రవి వర్మ తదితరులు;
ఎడిటిం గ్: జునైద్ సిద్ధిఖీ;
సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని;
మ్యూజిక్: సునీల్ కశ్యప్;
నిర్మా తలు: వెంకట కిరణ్, హేమ మాధురి;
స్క్రీ న్ప్లే, డైలాగ్స్, స్టోరీ, డైరెక్షన్: రాజ్ మాదిరాజు;
ఓటీటీ ప్లాట్ఫామ్: ఈటీవీ విన్

వెండితెరతోపాటు ప్రతివారం ఓటీటీ వేదికల్లోనూ కొత్త సినిమాల సం దడి కనిపిస్తోం ది. అలా ‘దసరా’ సం దర్భం గా
‘ఈటీవీ విన్’ లో విడుదలైన తాజా చిత్రం ‘#కృ ష్ణారామా’ (#KrishnaRama) రాజేం ద్ర ప్రసాద్ , గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ మాదిరాజు రూపొం దిం చిన సినిమా ఇది. మరి ఈమూవీ స్టోరీ ఏం టి? ఎలా ఉం దం టే?.

సినిమా కథేం టం టే: రామతీర్థ అలియాస్ రామ (రాజేంద్ర ప్రసాద్), కృ ష్ణవేణి అలియాస్ కృ ష్ణ అన్యో న్యం గా
జీవిస్తుం టారు.వీరు వృ త్తిరీత్యా ఉపాధ్యా యులు. వీరికి ముగ్గురు సం తానం కాగా అం తా విదేశాల్లో స్థిరపడతారు.
పిల్లలకు దూరంగా ఉం టున్నా మనే బాధతోనే విశ్రాం త జీవితాన్ని గడుపుతుం టారు. నెలలో ఒక్క రోజు వీడియో
కాల్ ద్వా రా వారితో ముచ్చ టిస్తుం టారు. మళ్లీ ఆ సమయం ఎప్పు డొస్తుం దోనని ఆశగా ఎదురుచూస్తుం టారు.
అలా నెలలో ఒక్క రోజు కాకుం డా ప్రతిరోజూ పిల్లలతో టచ్లో ఉం డేం దుకు ఈ రిటైర్డ్ టీచర్స్ ప్రీతి (అనన్య శర్మ )
సాయం తో సామాజిక మాధ్య మాల్లో ఒకటైన ఫేస్బుక్ ఖాతా తెరుస్తారు. #KrishnaRama (#కృ ష్ణారామా) పేరుతో
తమ అభిప్రాయాలను నిర్మొ హమాటం గా షేర్ చేస్తుం టారు. ఈ క్రమం లో యూత్లో మం చి ఫాలోయిం గ్
సం పాదిం చుకున్న వారికి.. ఒకరి నుం చి ఒకరు విడిపోయే పరిస్థితి వస్తుం ది. ఆత్మ హత్య కూ ప్రయత్ని స్తారు.
వారెం దుకు ఆ నిర్ణయం తీసుకున్నా రు? అసలు పిల్లల విషయం లో వారి లక్ష్యం నెరవేరిం దా, లేదా? అసలు
వారికి, ప్రీతికి సం బం ధమేం టి? వీటన్నిం టికీ సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిం దే

ఎలా ఉం దం టే: పిల్లలకు దూరంగా ఉం డే తల్లీదం డ్రుల బాధ ఎలా ఉం టుం దో కళ్లకు కట్టినట్లు చూపిం చే
చిత్రమిది. టెక్నా లజీ గురిం చి తెలియకపోయినా, దాన్ని నేర్చు కునే ఓపిక లేకపోయినా పిల్లల కోసం ఏదైనా
చేస్తామని నిరూపిం చే రామతీర్థ, కృ ష్ణవేణిల సాహసం ఇది. కుటుం బ బం ధాలతోపాటు సామాజిక అం శాలనూ
తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను ఆలోచిం పజేశారు దర్శకుడు రాజ్. కృ ష్ణారామా సూసైడ్కు సిద్ధపడే ఫస్ట్షాట్తోనే
సినిమాపై ఆసక్తి పెం చిన దర్శకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుం డా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం
చేశారు. రామతీర్థ, కృ ష్ణవేణిల ఒం టరితనం , పిల్లలకు దగ్గరకావాలని వారు పడే తపన, అం దుకు ఫేస్బుక్ ఖాతా
తెరిచే ప్రయత్నం తదితర సన్నివేశాలు ప్రథమార్ధం లో కీలకం . ఫొటో స్టూడియోకి వెళ్లి పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు
దిగడం , ఫేస్బుక్ మేనేజరుకు లేఖ రాయడం .. ఇలా వారు చేసే హం గామా కడుపుబ్బా నవ్వి స్తుం ది. ఖాతా తెరిచిన తర్వా త.. నెట్టిం ట పాపులరైన కం టెం ట్ను రీక్రియేట్ చేసిన సీన్ మెప్పి స్తుం ది. పక్కిం టి అమ్మా యిలాఉం డే ప్రీతి పాత్ర ఆకట్టుకుం టుం ది. ఇలా
కథను సరదాగా నడిపిస్తూనే కొం చెం సీరియస్ టచ్ ఇచ్చి ఇం టర్వె ల్ను
తీర్చి దిద్దడం బాగుంది. దాం తో, ద్వి తీయార్థం లో ఏం జరుగుతుం దోనన్న ఉత్కం ఠ నెలకొం టుంది.

ఫస్ట్ హాఫ్ వినోదాత్మ కం గా రూపొం దిం చిన దర్శకుడు సెకండ్ హాఫ్ పూర్తిస్థాయిలో సీరియస్గా మలిచారు. ఈ
క్రమం లో.. ‘పిల్లల కోసం సోషల్ మీడియాలోకి వచ్చి న కృ ష్ణారామా దారి తప్పా రు’ అని ప్రేక్షకుడు ఫీలయ్యే
అవకాశం లేకపోలేదు. ఫేస్బుక్ అకౌం ట్ ఓపెనిం గ్ తర్వా త కృ ష్ణారామా, వారి పిల్లల మధ్య చోటుచేసుకునే
సన్నివేశాలను మరిం త బలం గా చూపిం చాల్సిం ది. ఓ అమ్మా యి హత్యా చారానికి గురవడం , పోలీసులు
నిందితులను ఎన్కౌం టర్ చేయడం .. ఈ వాస్తవ సం ఘటనల ఆధారంగా ఇప్ప టికే కొన్ని చిత్రాలొచ్చా యి. ఈ
పరిణామాలను కథలో భాగం చేసి సోషల్ మీడియా పాత్ర ఎలా ఉం టుం ది? దాని ద్వా రా వ్య క్తిగత జీవితం ఎలా
ప్రభావితమవుతుం దో కృ ష్ణారామా ద్వా రా చూపిం చే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే, అక్క డక్క డా సాగదీత
అనిపిస్తుం ది. కీలక ఘట్టాల సమయం లో ఓ బ్యాం డ్ తెరపై కనిపిస్తూ బుర్రకథ తరహాలో ప్రదర్శనలివ్వ డం కొత్త
అనుభూతి పం చుతుం ది. సం తృ ప్తికర ముగిం పు ఇచ్చా రు. కొనసాగిం పునకు స్కో ప్ ఉన్న కథ ఇది

సినిమాలో ఎవరెలా చేశారంటే: రామతీర్థలాం టి పాత్రలు రాజేంద్ర ప్రసాద్కు కొట్టిన పిం డిలాం టివి. తం డ్రి పాత్రలో ఆయన
మరోసారి సత్తా చాటారు. కృ ష్ణవేణిలో పాత్రలో గౌతమి ఒదిగిపోయారు. ఈ ఇద్దరి నటనే సినిమాకు ఓ బలం .
అనన్య శర్మ పాత్ర నిడివి తక్కు వే అయినా కీలకం . శ్రీకాం త్ అయ్యం గార్, జెమిని కిరణ్, రచ్చ రవి, రవి వర్మ
తదితరులు సం దర్భా నుసారం తెరపై కనిపిం చి ఆకట్టుకుం టారు.

సినిమా సాం కేతికం గా ఎలా ఉం ది: గతం లో ‘రుషి’, ‘ఆం ధ్రాపోరి’, ‘గ్రే: ది స్పై హూ లవ్డ్ మీ’ తదితర చిత్రాలను
తెరకెక్కిం చిన దర్శకుడు రాజ్ ‘#కృ ష్ణారామా’తో అటు పెద్దలు, ఇటు పిల్లలకు కనెక్ట్ అయ్యే సజ్జెక్ట్ను బాగా డీల్
చేశారు. ‘మీది యం త్రాం గం అయితే మాది మం త్రాం గం ’లాం టి సం భాషణలు ఆకట్టుకుం టాయి. కీలక
సన్నివేశాలకు సం బం ధిం చి సునీల్ కశ్యప్ అం దిం చిన ‘కృ ష్ణారామా’ బీజీఎం (నేపథ్య సం గీతం ) అలరిస్తుం ది. ప్రతి
ఫ్రేమ్లో రంగనాథ్ గోగినేని పనితనం కనిపిస్తుం ది. ఎడిటిం గ్ విషయం లో జునైద్ సిద్ధిఖీ ఓకే. నిర్మా ణ విలువలు
బాగున్నా యి

చివరిగా : ఎక్క డా అసభ్య తకు తావులేదు. దీన్ని ట్రై చేశారు తప్ప్పకుండా చూసే చిత్రం

సినీ మిర్చి .కామ్ రేటింగ్ 3/5